YSRCP: 80/60కి పడిపోయిన వైసీపీ ఎంపీ అవినాష్ బీపీ... రంగంలోకి దిగిన పోలీసులు!

  • ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలు
  • 71కి పడిపోయిన అవినాష్ షుగర్ లెవల్స్
  • మిధున్ రెడ్డి బీపీ 110/70
  • పోలీసులకు సహకరించేది లేదంటున్న ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ గడచిన ఐదు రోజులుగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి రక్తపోటు స్థాయి 80/60కి పడిపోయింది. ఈ ఉదయం ఆయన బీపీ బ్లడ్ షుగర్ లను చెక్ చేసిన వైద్యులు, ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించకుంటే ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. ఆయన బ్లడ్ షుగర్ లెవెల్ సైతం 71కి పడిపోయింది.

దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించగా, తాను వచ్చేది లేదని అవినాష్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో మరో ఎంపీ మిధున్ రెడ్డి బీపీ 110/70గా ఉండగా, బ్లడ్ షుగర్ 73కు తగ్గింది. ఇద్దరి శరీరాల్లో కీటోన్స్ 2గా ఉన్నాయని పరీక్షలు చేసిన ఆర్ఎంఎల్ వైద్యులు వెల్లడించారు. ఇద్దరూ డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నారని పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. ప్రస్తుతం పోలీసు అధికారులు దీక్షను విరమించాలని ఎంపీలతో చర్చిస్తుండగా, వారు వినకుంటే అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.

More Telugu News