Kodandaram: మరి, ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు వాహనాలు రాలేదా?: కోదండరామ్

  • టీజేఎస్ ఆవిర్భావ సభకు అనుమతివ్వరా!
  • మరి, ‘భరత్ అనే నేను’కు వాహనాలు రాలేదా? 
  • ఆ వాహనాల నుంచి పొగ రాలేదా?
  • అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా ఆవిర్భావ సభ నిర్వహించి తీరుతాం

తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ సభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ నేత, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో సభ పెడితే అక్కడికి వచ్చే వాహనాల పొగ కారణంగా కాలుష్యం పెరుగుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే, అనుమతివ్వడం లేదని పోలీస్ శాఖ చెప్పిందని అన్నారు.

మరి, ఇటీవల ఎల్బీ స్టేడియంలో ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతిచ్చారని, ఆ వేడుకకు వాహనాలు రాలేదా? వాటి నుంచి పొగరాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించి తీరుతామని కోదండరామ్ స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News