nani: కృష్ణ పాత్ర ఛాలెంజింగ్ గా అనిపించింది .. అదే నాకు నచ్చింది: నాని

  • నాని హీరోగా 'కృష్ణార్జున యుద్ధం'
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • ఈ నెల 12వ తేదీన భారీ రిలీజ్

ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తూ .. వాళ్ల ఆదరాభిమానాలను అందుకుంటూ నాని ముందుకెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమా చేశాడు. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది.

 ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ .. " ఈ సినిమాలో నేను చేసిన కృష్ణ .. అర్జున్ పాత్రలలో కృష్ణ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. కృష్ణ పాత్ర ఛాలెంజింగ్ గా అనిపించింది .. అంతేకాదు ఈ పాత్ర పండించే ఫన్ నాకు నచ్చింది. సినిమాలో ఈ పాత్ర చిత్తూరు యాస మాట్లాడుతుంది .. అలా మాట్లాడటం నాకు కొంచెం ఇబ్బంది అయింది. దర్శకుడు మేర్లపాక గాంధీ సహకారంతో బాగా చేయగలిగాను. ఈ సినిమా సక్సెస్ అవుతుందనే పూర్తి నమ్మకంతో వున్నాను .. ఒకవేళ నా జడ్జ్ మెంట్ తప్పినా దానిని ఫేస్ చేయడానికి సిద్ధంగా వున్నాను" అని చెప్పుకొచ్చాడు.    

More Telugu News