narasimha raju: ఇంట్లో చెప్పకుండా మద్రాస్ ట్రైన్ ఎక్కేశాను: నటుడు నరసింహరాజు

  • సినిమాలు బాగా చూసేవాడిని 
  • మద్రాస్ వెళ్లి ప్రయత్నాలు చేశాను 
  • 'నీడలేని ఆడది'తో హీరోనయ్యాను
విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రాల ద్వారా నరసింహరాజు ప్రేక్షకులకు చేరువయ్యారు. కొన్ని సాంఘిక చిత్రాలలోనూ ఆయన కథానాయకుడిగా మెప్పించారు. ఆ తరువాత ధారావాహికల్లో ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. అలాంటి ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

 "చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేవాడిని .. దాంతో నేను కూడా యాక్టర్ ను కావాలనుకున్నాను. ఇంట్లో వాళ్లకి చెబితే వద్దంటారని భావించి, వాళ్లకి చెప్పకుండానే మద్రాస్ కి వెళ్లే ట్రైన్ ఎక్కేశాను. ఆరంభంలో అక్కడ కొన్ని ఇబ్బందులు పడినా, నేను చేసిన ప్రయత్నాలు ఫలించి 'నీడలేని ఆడది' సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమా బాగా ఆడటంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.    
narasimha raju

More Telugu News