Agri Gold: అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. చేతులెత్తేసిన ఎస్సెల్-జీ గ్రూపు

  • ఆస్తుల కంటే అప్పులు ఎక్కువని తేలడంతో ఎస్సెల్ జీ గ్రూప్ యూటర్న్
  • ఆస్తులు రూ.2,500 కోట్లు.. అప్పులు రూ.10 వేల కోట్లు
  • పునరాలోచిస్తామని కోర్టుకు తెలిపిన ఎస్సెల్ జీ సంస్థ

అగ్రిగోల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆ సంస్థ ఆస్తులను టేకోవర్ చేయడానికి ముందుకొచ్చిన ఎస్సెల్-జీ గ్రూపు తమ వల్ల కాదని చేతులెత్తేసింది. సంస్థ ఆస్తులు రూ.2,500 కోట్లు ఉండగా, అప్పులు మాత్రం రూ.10 వేల కోట్లుగా తేలడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. టేకోవర్ అంశాన్ని పునరాలోచిస్తామని ఎస్సెల్-జీ గ్రూప్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది కాబట్టి, ఆస్తులను కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని బాధితులకు బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టును కోరారు. కాగా, ఈ అంశంపై నిర్ణయం కోసం తమకు రెండు వారాల గడువు ఇవ్వాలని స్పెషల్ జీపీ కృష్ణ ప్రకాశ్ కోర్టును కోరారు. అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.

More Telugu News