Yanamala: ఏపీలో 2014లో వచ్చిన ఓట్లలో పదోవంతు కూడా బీజేపీకి రావు: యనమల

  • మోదీ మాటలే చెబుతారు 
  • చేతలు శూన్యమనేది రుజువైంది
  • మోదీ చేసిందేమీ లేదు
  • బీజేపీ నేతల మాటలు హాస్యాస్పదం
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏపీలో 2014లో వచ్చిన ఓట్లలో పదో వంతు ఓట్లు కూడా రావని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రధాని మోదీ మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు. నాలుగేళ్లలో పేదలకు, మధ్య తరగతికి మోదీ చేసిందేమీ లేదని, బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు అనడం హాస్యాస్పదమని తెలిపారు. నాటకాలలో బీజేపీది అందెవేసిన చెయ్యని, ఏపీని, టీడీపీని విమర్శించడానికే జీవీఎన్‌ నరసింహారావుని బీజేపీ రాజ్యసభకు పంపినట్లుందని వ్యాఖ్యానించారు. చట్టంలో పొందు పర్చిన అంశాలను అమలు చేయమంటే బీజేపీకి ఎందుకంత కోపం వస్తుందని ప్రశ్నించారు. అన్నీ ఇస్తే ఏపీ అగ్రగామి అవుతుందని బీజేపీ భయపడుతోందని, బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yanamala
BJP
Telugudesam

More Telugu News