India: నీరవ్ మోదీ విషయంలో భారత్‌ రాసిన లేఖపై స్పందించిన చైనా

  • బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి పారిపోయిన నీరవ్ మోదీ
  • ప్రస్తుతం హాంకాంగ్‌లో నిందితుడు
  • పలు దేశాలకు భారత్‌ లేఖలు
  • హాంకాంగ్ స్వతంత్రంగా వ్యవహరిస్తోందని చైనా సమాధానం

పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా ఇతర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం హాంకాంగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తించిన భారత్‌.. ఇటీవల చైనాతో పాటు పలు దేశాలకు ఈ విషయమై లేఖలు రాసింది. నిందితుడిని భారత్‌కు అప్పగించే క్రమంలో సహకరించాలని కోరింది. భారత్‌ రాసిన లేఖపై స్పందించిన చైనా.. స్థానిక చట్టాలు, ఇరు దేశాల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా హాంకాంగ్ నిర్ణయం ఉంటుందని పేర్కొంది. అలాగే నీరవ్ మోదీని అరెస్టు చేసే విషయంలో హాంకాంగ్ స్వతంత్రంగా వ్యవహరిస్తోందని తెలిపింది. కాగా భారత్‌లోని పలు బ్యాంకుల్లో వేలాది కోట్లు అప్పు చేసిన నీరవ్ మోదీ మొదట అమెరికా ఆ తరువాత లండన్‌లోనూ తలదాచుకున్న విషయం తెలిసిందే.

More Telugu News