Narendra Modi: అలా చెప్పుకోవడానికి మోదీకి సిగ్గు ఉండాలి: షబ్బీర్ అలీ

  • బలహీనవర్గాలకు చెందిన వ్యక్తినని మోదీ చెప్పుకోవడం సిగ్గు చేటు
  • భార్యకు ప్రమాదం జరిగినా స్పందించని వ్యక్తిత్వం మోదీది
  • బయటి మహిళల గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదం

ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భార్య జశోదాబెన్ కు యాక్సిడెంట్ జరిగితే, కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లనటువంటి దారుణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మోదీ అని మండిపడ్డారు. భార్యనే పట్టించుకోని వ్యక్తి... బయటి మహిళల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినంటూ మోదీ చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఓ రోడ్ యాక్సి డెంట్ లో మోదీ భార్య జశోదాబెన్ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మోదీ స్పందించలేదు.

  • Loading...

More Telugu News