Visakhapatnam District: ప్రత్యేక హోదా కోసం రంగంలోకి దిగిన హిజ్రాలు!

  • విశాఖ జిల్లా యలమంచిలిలో హిజ్రాల దీక్షలు
  • టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరానికి ర్యాలీగా వెళ్లిన హిజ్రాలు
  • హోదా ఇచ్చే వరకూ తాము పోరాడతామంటున్న వైనం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా, ఈ ఉద్యమానికి హిజ్రాలు కూడా మద్దతు తెలిపారు. విశాఖ జిల్లా యలమంచిలి పట్టణంలో హిజ్రాలు దీక్షలు చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వారు పాల్గొన్నారు. విశాఖలోని స్థానిక శేశుకొండ కాలనీలో నివాసం ఉంటున్న హిజ్రాలందరూ ప్లకార్డులు చేతబూని ర్యాలీగా శిబిరం వద్దకు చేరుకున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము కూడా ఉద్యమిస్తామని, హోదా ఇచ్చే వరకూ తాము పోరాడతామని చెప్పారు.
Visakhapatnam District
hizras
special status

More Telugu News