femina: ‘ఫెమినా’ కవర్ పేజీపై ‘జిగేల్ రాణి’ !

  • ‘రంగస్థలం’ ఐటమ్ సాంగ్ ‘జిగేల్ రాణి..’ లో మెరిసిన పూజా హెగ్డే
  • ‘ఫెమినా’ తాజా సంచిక కవరేజ్ ఫొటో పూజా హెగ్డే 
  •  బికినీ ధరించి ఈత కొలనులో ఉన్న ముద్దుగుమ్మ
‘రంగస్థలం’ సినిమాలో ఐటమ్ సాంగ్ ‘జిగేల్ రాణి..’ లో మెరిసిన నటి పూజాహెగ్డే. ఈ పాటలో తన డ్యాన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఫెమినా మ్యాగజైన్ తాజా సంచిక కవర్ పేజీపై ఆమె దర్శనమిస్తోంది. బికినీ ధరించి ఈత కొలనులో ఉన్న పూజా హెగ్డే ను కవర్ పేజీ ఫొటోగా ‘ఫెమినా’ ప్రచురించింది.  కాగా, ప్రస్తుతం ‘సాక్ష్యం’ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మోడలింగ్ నుంచి సినీ రంగానికి వచ్చిన పూజా హెగ్డే ఇప్పటి వరకు చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి, ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఉంటుందని సినీ వర్గాల సమాచారం.
femina
pooja hegde

More Telugu News