atlee kumar: బన్నీతోనూ లేదు .. ప్రభాస్ తోను లేదు: తమిళ స్టార్ డైరెక్టర్

  • బన్నీతో అనుకోలేదు 
  • ప్రభాస్ తోను చేయడం లేదు 
  • తమిళ సినిమాలతో బిజీ

తమిళ అగ్ర దర్శకులలో అట్లీ కుమార్ పేరు కూడా కనిపిస్తుంది. వరుస హిట్లు సాధిస్తోన్న అట్లీ కుమార్ .. త్వరలో తెలుగు సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ముందుగా బన్నీతో ఆయన సినిమా ఉంటుందనీ, ఆ తరువాత ప్రభాస్ తోను ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది.

కృష్ణంరాజు సొంత బ్యానర్ పై సినిమాను ప్రభాస్ పూర్తి చేశాక ఈ సినిమా ఉంటుందని అన్నారు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో అట్లీ కుమార్ మాట్లాడుతూ .. ప్రస్తుతం తాను ఏ తెలుగు సినిమా చేయడం లేదని చెప్పాడు. తాను తమిళ చిత్రాలతో బిజీగా ఉండటం వలన, ఇప్పట్లో తెలుగులో చేసే అవకాశం లేదని అన్నాడు. దాంతో ఇప్పటివరకూ జోరుగా జరుగుతోన్న ప్రచారానికి తెరపడినట్టైంది.  

More Telugu News