devineni: పాపాలు చేసే జగన్ లాంటి వారికి ప్రకృతి కూడా సహకరించదు: మంత్రి దేవినేని

  • జగన్ పాదయాత్ర మార్నింగ్ వాక్..ఈవినింగ్ వాక్ లా ఉంది
  • ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్న జగన్ తన భాష మార్చుకోవాలి
  • బీజేపీతో కుమ్మక్కయ్యాడు
  • విజయసాయిరెడ్డితో రాజీనామా ఎందుకు చేయించలేదు?
పాపాలు చేసే వైసీపీ అధినేత జగన్ లాంటి వారికి ప్రకృతి కూడా సహకరించదని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ చేస్తున్న పాదయాత్ర మార్నింగ్ వాక్ .. ఈవినింగ్ వాక్ చేస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. ఒక దొంగను చూసేందుకు ఎంతగా ఆసక్తి చూపుతారో, జగన్ ని చూసేందుకు కూడా ప్రజలు అంతగా ఆసక్తి చూపుతున్నారని, అందుకే, ఆయన సభలకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుకు ఏడు ప్రశ్నలు వేసిన జగన్, ప్రధాని మోదీకి ఒక్క ప్రశ్నా సంధించలేదని అన్నారు. సీఎం చంద్రబాబుపై, తమ పార్టీ నేతలపై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్న జగన్ భాష మార్చుకోవాలని, సీఎంను బావిలో దూకమని అంటావా? అంటూ మండిపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ తో, ఇప్పుడు బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యాడని, ఏపీకి హోదాకు తమ ఎంపీలతో రాజీనామా చేయించామని చెబుతున్న ఆయన, విజయసాయిరెడ్డితో ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ కు, టీడీపీ సర్కార్ ను ప్రశ్నించే హక్కులేదని, ప్రధాని నివాసం వద్ద చేయాల్సిన దీక్షను ఏపీ భవన్ లో చేస్తే ఉపయోగమేంటని వైసీపీని ప్రశ్నించారు.
devineni
Jagan

More Telugu News