srireddy: నటి శ్రీరెడ్డికి మద్దతుగా ట్రాన్స్ జెండర్!

  • శ్రీరెడ్డిని ఎవరూ లెక్కచేయట్లేదు
  • ఇంతవరకూ ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు
  • వీడియో పోస్ట్ చేసిన ట్రాన్స్ జెండర్ సోనా రాథోడ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో తనకు సభ్యత్వం ఇవ్వకపోవడంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద నటి శ్రీరెడ్డి నిన్న అర్ధనగ్నంగా తన నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి మద్దతుగా ఓ ట్రాన్స్ జెండర్ నిలిచింది. శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఉంది. ‘తెలుగు అమ్మాయి బట్టలు విప్పేసి ఫిల్మ్ ఛాంబర్ ముందు నిలబడ్డా ఎవరూ లెక్కచేయట్లేదు. ఇంతవరకూ ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు ... నేను హిజ్రాను. ఈసారి నేను బట్టలు విప్పేస్తా. ఫిల్మ్ ఛాంబర్ అంతా తిరిగి, పెట్రోల్ పోసుకుని .. మీడియా ముందు కాల్చుకుని చచ్చిపోతా. సినిమాల్లో మాకు ఛాన్స్ ఇవ్వండి’ అని ఆ వీడియోలో ఆ ట్రాన్స్ జెండర్ సోనా రాథోడ్ హెచ్చరించింది.

More Telugu News