Salman Khan: ఒక్కడి కోసం ప్రత్యేక విమానం... అతనే సల్మాన్ ఖాన్!

  • నిన్న బెయిల్ పై విడుదలైన సల్మాన్
  • భారీ భద్రత మధ్య ఎయిర్ పోర్టుకు
  • ప్రత్యేక విమానంలో ముంబైకి పయనం
కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడ్డ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నిన్న సాయంత్రం జోధ్ పూర్ జైలు నుంచి బెయిలుపై విడుదల అయిన అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లాడు. సల్మాన్ కు బెయిల్ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోగా, భారీ బందోబస్తు మధ్య ఆయన్ను జైలు నుంచి జోధ్ పూర్ ఎయిర్ పోర్టుకు పోలీసులు తరలించారు. అప్పటికే సల్మాన్ ఖాన్ ను ముంబై చేర్చేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసి ఉంచారు స్నేహితులు. ఆ విమానంలో సల్మాన్ ముంబై చేరుకోగా, ఎయిర్ పోర్టుతో పాటు ఆయన ఇంటి వద్ద ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరి స్వాగతం పలికారు. 
Salman Khan
Blackbuch
Mumbai
Jodhpur

More Telugu News