Mahesh Babu: మహేష్ బాబు - జూనియర్ ఎన్టీఆర్ ని పక్కపక్కనే చూస్తుంటే .. : నటుడు బ్రహ్మాజీ

  • పోకిరి’,‘యమదొంగ’లను చూస్తుంటే కనుల పండువగా ఉంది
  • వీళ్లతో ఓ సినిమా తీయాలని..నిర్మాతగా మారాలని ఉంది
  • ఆ సినిమా పేరు ‘దేవుడు చేసిన మనుషులు
హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లు పక్కపక్కనే కూర్చున్న దృశ్యం చూస్తుంటే కనుల పండువగా ఉందని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రశంసించాడు. ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన బ్రహ్మాజీ మాట్లాడుతూ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తుంటే..‘పోకిరి’, ‘యమదొంగ’లను కలిపి ఓ సినిమా తీయాలని, ఆ సినిమాకు నిర్మాతగా మారాలనే ఆలోచన తనకు వచ్చిందని, ఆ సినిమా పేరు ‘దేవుడు చేసిన మనుషులు’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇలాంటి సినిమా తీయగలిగే డైరెక్టర్ కు నిజాయతీ ఉండాలని, ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలతోనే ‘భరత్ అనే నేను’ సినిమా తీశారని అన్నాడు. ఈ సినిమా చూసొచ్చిన తర్వాత కనీసం రెండు మూడు గంటలు దీని గురించే మాట్లాడుకుంటారని అన్నారు.  
Mahesh Babu
junior ntr
brahmaji

More Telugu News