tenali: పచ్చ చొక్కాలు దోచుకుంటున్నాయి : తెనాలిలో వైఎస్ జగన్

  • ఇసుక రీచ్ లలో అడ్డగోలుగా అక్రమ రవాణా జరుగుతోంది
  • ఇసుక, మట్టి, భూములు అన్నింటినీ దోచుకుంటున్నారు
  •  చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు

ఆంధ్రా ప్యారిస్ (తెనాలి)ని పచ్చచొక్కాలు దోచుకుంటున్నాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, కొల్లిపర, తాడేపల్లి, తుళ్లూరు, పెదకూరపాడు మండలాల్లోని ఇసుక రీచ్ లలో అడ్డగోలుగా అక్రమ రవాణా జరుగుతోందని, ఇసుక, మట్టి, భూములు అన్నింటినీ దోచుకుంటున్నారని, వీటన్నింటిలో చినబాబు, పెదబాబుకు ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ప్రజలకు తాగడానికి నీళ్లివ్వరూ కానీ, కోకోకోలా కంపెనీకి మాత్రం నీళ్లిస్తారని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులు పండించిన ఏ పంటకూ మద్దతు ధర కల్పిచండం లేదని, చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని విమర్శించిన జగన్, ‘ప్రతి ఇంటికి కిలో బంగారం, ఒక బెంజ్ కారు’ ఇస్తాననే వాగ్దానంతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News