salman: సల్మాన్ ఎంతో దయార్ద్రహృదయుడు: శత్రుఘ్నసిన్హా

  • సల్మాన్ ఇప్పటికే చాలా కుమిలిపోయారు
  • గత ఇరవై ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగారు
  • సల్మాన్ కు శిక్షవేయాలనుకుంటే సమాజ సేవ చేయమని చెప్పాలి

కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ కు శిక్ష పడటంపై బాలీవుడ్ ప్రముఖలు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జోథ్ పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న సల్మాన్ ని నటి ప్రీతి జింటా నిన్న కలిసింది. పలువురు సినీ ప్రముఖులు సల్మాన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిసి పరామర్శిస్తున్నారు. తాజాగా, సల్మాన్ నివాసానికి నాటి నటుడు శత్రుఘ్ణ సిన్హా, ఆయన కూతురు సోనాక్షి సిన్హా  వెళ్లి పరామర్శించారు.

 అనంతరం, శత్రుఘ్న సిన్హా మీడియాతో మాట్లాడుతూ, కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఇప్పటికే చాలా కుమిలిపోయారని, గత ఇరవై ఏళ్లుగా ఈ కేసు నిమిత్తం ఆయన కోర్టుల చుట్టూ తిరిగారని, ఇప్పుడు ఐదేళ్ళ శిక్ష విధించారని అన్నారు. కోర్టుల చుట్టూ తిరిగిన ఇరవై ఏళ్లు, శిక్ష విధించిన కాలం ఐదేళ్లు..ఈ మొత్తం కలిపితే ఇరవైదేళ్లని.. సల్మాన్ ఓ పెద్ద స్టార్ అని చెప్పే ఇంత శిక్ష వేశారని విమర్శించారు. తాను చూసిన వారిలో సల్మాన్ ఎంతో దయార్ద్ర హృదయుడని, అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటాడని చెప్పిన శత్రుఘ్న సిన్హా, సల్మాన్ కు శిక్షవేయాలనుకుంటే సమాజ సేవ చేయమని చెప్పాలని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News