mp murali mohan: ఆసుపత్రిలోనూ ‘ప్రత్యేక హోదా మా డిమాండ్’ అంటున్న ఎంపీ మురళీమోహన్ !

  • రామ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మురళీమోహన్
  • ఆయన  బెడ్ పైనే ‘ప్రత్యేక హోదా’ డిమాండ్ బోర్డు
  • వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న ఎంపీ

లోక్ సభ స్పీకర్ చాంబర్ లో టీడీపీ ఎంపీల దీక్షను నిన్న భగ్నం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ ఎంపీలను బలవంతంగా మార్షల్స్ బయటకు తీసుకొచ్చే క్రమంలో మురళీమోహన్ అస్వస్థతకు గురవడంతో రామమనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించడం విదితమే. ఏపీకి న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై తన నిరసన వ్యక్తం చేసిన మురళీమోహన్, ఆసుపత్రిలోనూ వినూత్న రీతిలో తన నిరసన వ్యక్తం చేశారు. తాను పడుకున్న బెడ్ పక్కనే ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మా డిమాండ్’ బోర్డును పెట్టుకుని నిరసన కొనసాగించడం గమనార్హం. కాగా, ప్రస్తుతం మురళీమోహన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరగానే ఆయన కోలుకుంటారని వైద్యులు చెప్పారు. 

  • Loading...

More Telugu News