paruchuri: మహేశ్‌ బాబు బుర్రిపాలెం బుల్లోడిలా ఉన్నాడు: పరుచూరి గోపాలకృష్ణ

  • 'భరత్ అనే నేను' సినిమాలో మహేశ్‌ లుక్‌పై ప్రశంసలు
  • భుజం మీద నాగలి, తలపాగా, లుంగీ ఎత్తికట్టుతో మహేశ్
  • సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

కొరటాల శివ దర్శకత్వంలో మ‌హేశ్ బాబు న‌టించిన 'భరత్ అనే నేను' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో లుంగీ కట్టులో మహేశ్ బాబు కనపడిన తీరుపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

తాజాగా, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేస్తూ మహేశ్ బాబుని అభినందించారు. 'భుజం మీద నాగలి, తలపాగా, లుంగీ ఎత్తికట్టి మహేశ్ బాబు ముమ్మూర్తులా బుర్రిపాలెం బుల్లోడిలా ఉన్నాడ'ని ఆయన పేర్కొన్నారు. మహేశ్ బాబుకి, 'భరత్ అనే నేను' సినిమా టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News