indrania mukherjia: ఇంద్రాణి ముఖర్జియాకు అస్వస్థత..ఆసుపత్రిలో చికిత్స

  • షీనా బోరా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి
  • ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న ఆమెకు అస్వస్థత 
  • జేజే ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు

కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న ఆమె నిన్న రాత్రి అస్వస్థతకు గురవడంతో జేజే ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని, క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి ఎమర్జెన్సీ వార్డుకు తరలించినట్టు జేజే ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వైద్యుల నివేదిక ఇంకా విడుదల కావాల్సి ఉంది. అధిక మోతాదులో ఔషధాలను తీసుకున్న కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కాగా, 2012 ఏప్రిల్ లో ఇంద్రాణి ముఖర్జియా తన కూతురుని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఆమె భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజావ్ ఖన్నాలు కూడా నిందితులుగా ఉన్నారు. 

More Telugu News