shivaji: చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సంఘాల సమావేశం.. పవన్‌పై హీరో శివాజీ విమర్శలు

  • అమరావతిలో సమావేశం
  • పాల్గొన్న ప్రభుత్వ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు
  • చలసాని శ్రీనివాస్, శివాజీ హాజరు
  • పవన్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్న శివాజీ

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే లక్ష్యంగా అమరావతిలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అఖిలపక్ష సంఘాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, శివాజీ, సచివాలయ, ప్రభుత్వ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, జనసేన ఈ సమావేశానికి హాజరుకాలేదు.

ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ... గత అఖిలపక్ష సంఘాల సమావేశానికి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను రాలేకపోయానని చెప్పారు. ప్రజలను గందరగోళానికి గురి చేసేలా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అపరేషన్ గరుడ అనేది నిజమేనని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఈ ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. జాతీయ పార్టీల ఉచ్చులో కొన్ని పార్టీలు పడుతున్నాయని అన్నారు. 

  • Loading...

More Telugu News