Tollywood: నటి శ్రీరెడ్డిని అదుపులోకి తీసుకుని ఆమెను ఇంటి వద్ద దింపిన పోలీసులు

  • ఫిల్మ్ చాంబర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలిసిన శ్రీరెడ్డి
  • అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు
  •  శ్రీరెడ్డిని ఆమె నివాసం వద్దకు తీసుకెళ్లి దించిన పోలీసులు

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యత్వం ఇవ్వలేదంటూ ఈరోజు మధ్యాహ్నం ఫిల్మ్ చాంబర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఆమె నివాసం ఉంటున్న ఇంటి వద్దకు శ్రీరెడ్డిని తీసుకువెళ్లి దింపారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఒక సినిమాలో నటించిన నటీనటులందరికీ ‘మా’ సభ్యత్వం కార్డు ఇచ్చేస్తారని, తాను మూడు సినిమాలు తీసినా తనకు కార్డు ఇవ్వరా? తెలుగు నటులు అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అసోసియేషన్ ఏం చేస్తోంది? అని ఆమె ప్రశ్నించారు.

More Telugu News