maldives: భారత పొరుగు దేశం మాల్దీవుల్లో చైనా జోక్యంపై అమెరికా ఆందోళన

  • చైనా తీరు పొరుగు దేశాల ప్రయోజనాలకు విఘాతం
  • ఇది భారత్ కు ఆందోళన కలిగించేదే
  • స్వేచ్ఛా, ఉదారవాద ఒప్పందానికి చైనా కట్టుబడి ఉండాలి

హిందూ మహా సముద్రంలో భారత్ కు పొరుగునే ఉండే మాల్దీవుల్లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట చైనా జోక్యం పెరుగుతండడం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ పసిఫిక్ ఒప్పందం నిబంధనల మేరకు ఆ ప్రాంతంలో స్వేచ్ఛా, ఉదారవాదానికి అమెరికా కట్టుబడి ఉందని దక్షిణాసియా, ఆగ్నేయాసియాలకు సంబంధించి అమెరికా రక్షణ శాఖ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జోఫెల్టర్ అన్నారు. మాల్దీవుల్లో జరుగుతున్న పరిణామాలు, చైనా జోక్యంపై తమకు ఆందోళనగా ఉన్నట్టు తెలిపారు. ‘‘మాల్దీవులు భారత్ కు సమీపంలో ఉండే దేశం. ఇది భారత్ కు ఆందోళనకరమని మాకు తెలుసు. మాల్దీవుల్లో ఉన్న పరిస్థితులు ఆందోళన కలిగించేవే. ఇవి ఎంత వరకు వెళతాయో చూస్తాం’’ అని అమెరికా రక్షణ శాఖా అధికారి ఒకరు పేర్కొన్నారు. హిందూ పసిఫిక్ సముద్ర ప్రాంతం స్వేచ్ఛగా, ఉదారవాదంగా ఉండడం ద్వారానే ఆ ప్రాంతంలోని చిన్న పెద్ద దేశాల ప్రయోజనాలు పరిరక్షించొచ్చని తాము భావిస్తున్నట్టు జోఫెల్టర్ పేర్కొన్నారు. ఈ విధమైన ప్రయోజనాల పరిరక్షణకు చైనా కార్యకలాపాలు విఘాతం కలిగించేవిగా ఉన్నట్టు తాము భావిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News