suman: విద్యార్థులూ! ప్రత్యేక హోదా ఉద్యమంలోకి సినీ హీరోలను రమ్మనండి: సుమన్

  • రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహోదా చాలా అవసరం
  • హోదా కోసం విద్యార్థులు ఉద్యమించాలి
  • ఉద్యమంలో పాల్గొనాలని అభిమాన హీరోలను పిలవాలి
ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనేందుకు సినీ హీరోలను కూడా ఆహ్వానించమని ప్రముఖ సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన ర్యాప్సోడి-2కె 18 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన తరువాత రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబాటుకు గురైందన్నారు. హోదా వల్ల అభివృద్ధికి అవకాశం ఉందని ఆయన చెప్పారు.

స్పెషల్ స్టేటస్ కోసం విద్యార్థులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఉద్యమంలో అన్ని రంగాలు కలిసేలా ప్రయత్నాలు జరగాలని ఆయన సూచించారు. ఫోన్ ద్వారా అభిమాన హీరోలకు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునివ్వాలని ఆయన సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. ఏ రంగంలో ఉన్నా విలువలతో జీవించాలని ఆయన సూచించారు. 
suman
sv university
students
Special Category Status

More Telugu News