Ramcharan: 'రంగస్థలం', రామ్ చరణ్ గురించి రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఏమన్నారంటే..!

  • ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి
  • చిట్టిబాబు పాత్రను సుకుమార్ మలచిన తీరు సూపర్బ్
  • చరణ్, జగపతిబాబుల నటన అద్భుతం
రామ్ చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం' బాక్సాఫీస్ ను కొల్లగొడుతోంది. మరోవైపు, ఈ సినిమాలో చరణ్ నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ, రంగస్థలంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయని చెప్పారు. చిట్టిబాబు క్యారెక్టర్ ను సుకుమార్ మలచిన తీరు, ఆ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు సూపర్బ్ అంటూ కితాబిచ్చారు. చరణ్ నటనను చూడటం ఓ ట్రీట్ వంటిదని అన్నారు. ఈ సినిమాలో చరణ్ కు దీటుగా జగపతిబాబు నటించారని చెప్పారు. స్లోగా ఆయన డైలాగులు చెప్పిన తీరు అద్భుతంగా ఉందని అన్నారు. టెర్రిఫిక్ బాక్సాఫీస్ పర్ఫామెన్స్ ప్రదర్శించినందుకు మైత్రీ మూవీస్, సుకుమార్, ఇతర టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. 'రంగస్థలం' ఓ బుల్లెట్ లాంటి అఛీవ్ మెంట్ అని అన్నారు. రామ్ చరణ్ 'మైండ్ బ్లోయింగ్లీ ఫెంటాస్టిక్' అంటూ కితాబిచ్చారు. 'హేయ్ సుకుమార్ నీకు మూడు ధన్యవాదాలు, మూడు ముద్దులు' అంటూ ట్వీట్ చేశారు.
Ramcharan
Rajamouli
ram gopal varma
sukumar
rangasthalam

More Telugu News