harassment: లైంగికంగా వేధించిన ఫార్మా కంపెనీ ఏజీఎం.. మాదాపూర్ హాస్టల్ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతి!

  • ఫార్మా కంపెనీలో జాయినైన యువతి
  • ఆమెపై లైంగిక వేధింపులకు దిగిన ఏజీఎం అశితోష్
  • హాస్టల్ లో ఆత్మహత్యాయత్నం
ఫార్మా కంపెనీ ఏజీఎం పెట్టిన లైంగిక వేధింపులు భరించలేకపోయిన మహిళా ఉద్యోగిని మాదాపూర్ లోని హాస్టల్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిన ఘటన కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదు, మాదాపూర్ లోని ఒక హాస్టల్ లో ఉంటున్న యువతి, వారం రోజుల క్రితం బంజారాహిల్స్‌ రోడ్డునెం-2లో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ కంపెనీలో ఏజీఎంగా ఢిల్లీకి చెందిన అశితోష్‌ పనిచేస్తున్నాడు.

యువతి విధుల్లో జాయినైనప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, మానసికంగా, లైంగిక వేధింపులకు దిగుతున్నాడు. అతనికి మరో సహోద్యోగి గణేష్‌ సహకరిస్తూ, యువతిని వేధిస్తున్నాడు. వాటిని భరించలేకపోయిన ఆ యువతి, హాస్టల్ కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించిన సహచరులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి విచారించగా, వేధింపుల పర్వం వెలుగు చూసింది. దీంతో వారు షీటీమ్స్ ను ఆశ్రయించారు. షీటీమ్స్ పోలీసులు అశితోష్, గణేష్ లను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి, విచారణ చేపట్టారు.
harassment
sexual harassment
Hyderabad
sucide attempt

More Telugu News