Hyderabad: కొంప ముంచిన యువతి ఫేస్ బుక్ ఛాటింగ్.. తండ్రికి బెదిరింపులు!

  • ఫేస్ బుక్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ఛాట్ చేసిన యువతి
  • పెళ్లి చేసుకుంటాననడంతో నగ్న చిత్రాలు పంపిన యువతి
  • ఫోటోలతో యువతి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు

యువతి చేసిన ఫేస్ బుక్ ఛాటింగ్ ఆమె తండ్రిని 'నీ కూతుర్ని ఢిల్లీ పంపించు లేదా.. నీ కూతురి నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతాయి' అంటూ బెదిరించిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదులోని ఒక ట్రాన్స్‌ పోర్ట్‌ సంస్థలో పనిచేసే వ్యక్తికి మార్చి 27న 70148 34253 నంబరు నుంచి ‘నీ కూతుర్ని ఢిల్లీ పంపించు..లేని పక్షంలో మీ కుటుంబం మొత్తాన్ని హతమారుస్తాను, అలాగే నీ కూతురి నగ్న చిత్రాలు నా దగ్గరున్నాయి. వాటిని సోషల్ మీడియాలో పెడతాను’ అంటూ బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. వాటిని లైట్ గా తీసుకోవడంతో మెసేజీలు కూడా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, దర్యాప్తులో నిందితుడు గుర్గావ్‌ కు చెందిన దేవేంద్రసింగ్‌ (25) గా గుర్తించారు. అతను జైపూర్‌ లోని ఎంఎన్సీలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తూ, ఫేస్‌ బుక్‌ ద్వారా బాధితుడి కూతురిని పరిచయం చేసుకున్నాడని నిర్ధారించుకున్నారు. తొలుత బాగా మాట్లాడి, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, ఆమె నగ్న చిత్రాలు సంపాదించాడని గుర్తించారు. ఇవేవీ తెలియని కుటుంబ సభ్యులు ఆమెకు వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారని, దీంతో ఆ నగ్న ఫోటోలతో బ్లాక్‌ మెయిల్‌ చేయడం ఆరంభించాడని వెల్లడించారు. దీంతో గుర్గావ్‌ వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కాగా, అతను ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు.

More Telugu News