westindies: ప్రపంచంలోనే బెస్ట్.. కరాచీ బిర్యానీ!: వెస్టిండీస్ క్రికెటర్ కెస్రిక్ విలియమ్స్

  • పాక్ లో కరాచీ బిర్యానీ రుచి చూసిన వెస్టిండీస్ ప్లేయర్
  • ఆ బిర్యానీ ‘సూపర్’ అంటూ కితాబు
  • ఇలాంటి బిర్యానీని ఎక్కడా తినలేదన్న కెస్రిక్ విలియమ్స్
  • సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియో

‘ప్రపంచంలోనే బెస్ట్.. కరాచీ బిర్యానీ’ అంటూ వెస్టిండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ లొట్టలేసుకుని తింటున్నాడు. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ నిమిత్తం పాకిస్థాన్ లో ఇటీవల పర్యటించిన వెస్టిండీస్ జట్టు సిరీస్ ను చేజార్చుకుంది. ఈ జట్టులో కెస్రిక్ విలియమ్స్ కూడా ఉన్నాడు.

అసలు విషయమేంటంటే.. అక్కడ ఎంతో ఫేమస్ అయిన కరాచీ బిర్యానీని తిన్న కెస్రిక్ విలియమ్స్ ఆ బిర్యానీ ‘సూపర్’ అంటూ కితాబిచ్చేశాడు. ‘అద్భుతమైన రుచిగా ఉందని, ఇలాంటి బిర్యానీని ఎక్కడా తినలేదని, ప్రపంచంలోనే బెస్ట్ బిర్యానీ అని చెప్పాడు. కరాచీ బిర్యానీ ముందు ఏ బిర్యానీ నిలవలేదని, పోటీ ఇవ్వలేదని చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో కెస్రిక్ విలియమ్స్  బిర్యానీ తింటూ కూర్చున్నాడు.

More Telugu News