Special Category Status: టీడీపీ ఎంపీలను బలవంతంగా బయటకు తీసుకొచ్చిన మార్షల్స్‌

  • టీడీపీ ఎంపీలకు, మార్షల్స్‌కు మధ్య వాగ్వివాదం
  • కొందరు ఎంపీలకు అస్వస్థత?
  • సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌
ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఛాంబర్‌లో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. వారు బయటకు రావాలంటూ పార్లమెంటు సిబ్బంది పలుసార్లు విజ్ఞప్తి చేశారు. అయితే, బయటకు రావడానికి టీడీపీ ఎంపీలు ససేమిరా అనడంతో, అక్కడి నుంచి వారిని మార్షల్స్‌ సాయంతో బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీలకు, మార్షల్స్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొందరు ఎంపీలు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. 
Special Category Status
Andhra Pradesh
Lok Sabha

More Telugu News