comedian mahesh: సుకుమార్ గారు నిజంగానే నన్ను కొట్టివుంటే ఇంకా ఎక్కువ ఆనందపడేవాడిని: 'జబర్దస్త్' మహేశ్

  • 'రంగస్థలం'లో సుకుమార్ గారు ఛాన్స్ ఇచ్చారు 
  • కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను
  • ఆయన కాళ్లకి దణ్ణం పెట్టేశాను       
'రంగస్థలం' సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల దగ్గర సందడి .. భారీగా వసూళ్లు పెరుగుతున్నాయి. దాంతో ఈ సినిమా టీమ్ .. ఇటీవల సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్లో కమెడియన్ మహేశ్ పై సుకుమార్ చేయి చేసుకున్నాడనే వార్త బాగా వైరల్ అయింది. అదే విషయాన్ని గురించిన ప్రస్తావన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రాగా, అందుకు మహేశ్ స్పందించాడు.

'రంగస్థలం' సినిమా చేసిన తరువాత నేను సుకుమార్ గారిని కలవడం కుదరలేదు. విడుదలకి ముందు 10 రోజుల నుంచి ఆయన చాలా బిజీగా వున్నారు. సక్సెస్ టాక్ వచ్చిన తరువాత ఆయనను కలవాలనే కోరిక మరింత ఎక్కువైపోయింది. సక్సెస్ మీట్ లో ఆయన కనిపించగానే .. నాకు మంచి అవకాశం ఇచ్చారనే కృతజ్ఞతతో కాళ్లకి దణ్ణం పెట్టాను. 'ఏయ్..' అని వారిస్తున్నట్టుగా ఆయన నా మీదకి వచ్చారు. దాంతో చాలామంది సుకుమార్ గారు .. నన్ను కొట్టినట్టుగా రాశారు. ఆయన నన్నెందుకు కొడతారు .. ఒకవేళ నిజంగానే కొట్టి వుంటే నేను ఇంకా ఎక్కువ ఆనందపడేవాడిని" అంటూ చెప్పుకొచ్చాడు. 
comedian mahesh

More Telugu News