Cricket: లార్డ్స్ లో సౌరవ్ ని చూసి ముంబైలో నేను కూడా చొక్కా విప్పేశా!: రోహిత్ శర్మ

  • 2002లో నాట్‌ వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్ మ్యాచ్ 
  • అప్పుడు ఫ్రెండ్స్ తో కలసి ముంబైలో ఆ మ్యాచ్ చూస్తున్నా  
  • గంగూలీ చొక్కా తిప్పినంత సేపు మేము కూడా తిప్పాము

ఇంగ్లండ్ లోని లార్డ్స్ వేదికగా 2002లో జరిగిన నాట్‌ వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్ మ్యాచ్ తరువాతి సంఘటనను ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. ఫైనల్ లో ఇంగ్లండ్‌ పై భారత్‌ విజయం సాధించగానే లార్డ్స్ లోని గ్యాలరీ బాల్కనీలో కూర్చున్న అప్పటి టీమిండియా సారధి సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి గాల్లో తిప్పిన సమయంలో ముంబైలో క్రికెట్ చూస్తూ తాను, తన ఫ్రెండ్స్ కూడా చొక్కాలు విప్పేసి గంగూలీలా గాల్లో తిప్పుతూనే ఉన్నామని, గంగూలీ అలా తిప్పినంతసేపూ తాము కూడా షర్టును తిప్పుతూనే ఉన్నామని రోహిత్ శర్మ తెలిపాడు.

ఆ విక్టరీని గంగూలీ గుర్తు చేసుకుంటూ, ‘గాల్లో ఎగరవేసేందుకు నా టీ-షర్టు తీస్తున్నా. అప్పుడు నా పక్కనే కూర్చుని ఉన్న ఆటగాడు (లక్ష్మణ్‌ ) నా షర్టును వెనక్కి లాగుతూ ఉన్నాడు. నా వెనుక కూర్చున్న హర్భజన్‌ సింగ్‌ ఏమో ‘ఏం చేస్తున్నావు?’ అని ప్రశ్నించాడు. ‘నువ్వు కూడా చొక్కా తీసి గాల్లో తిప్పు’ అని అన్నానని గుర్తు చేసుకున్నాడు.

 దాని గురించి సచిన్ మాట్లాడుతూ, ‘లార్డ్స్‌ బాల్కనీలో కూర్చుని ఉన్నాం. మ్యాచ్‌ లో విజయం సాధించగానే సౌరవ్ చొక్కా తీసి గాల్లో ఊపడం ప్రారంభించాడు. సౌరవ్ ఏం చేస్తున్నాడో నాకు మొదట అర్ధం కాలేదు’ అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.

More Telugu News