comedian mahesh: సుకుమార్ ఇంటిచుట్టూ తిరిగా .. నా కల నిజమైంది: 'జబర్దస్త్' మహేశ్

  • డిగ్రీ పూర్తవ్వగానే హైదరాబాద్ వచ్చాను 
  • సుకుమార్ ఇల్లెక్కడనేది తెలుసుకున్నాను 
  • ఇక నా ప్రయత్నాలు మొదలెట్టాను 
'జబర్దస్త్' కామెడీ షో చూసేవాళ్లకి కమెడియన్ మహేశ్ తెలిసే ఉంటాడు. 'రంగస్థలం' సినిమాతో ఆయనకి మరింత గుర్తింపు వచ్చింది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. " 2011లో డిగ్రీ పూర్తి చేసిన నేను ఓ సంస్థలో పనిచేస్తూ, సుకుమార్ గారి ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాను. ఆయన ఇంటికి ఎదురుగా కూర్చుని ఆయన ఎప్పుడు బయటికి వస్తాడా అని ఎదురుచూసేవాడిని"

" నేను ఎదురు చూసినప్పుడు ఆయన బయటికి వచ్చిన సందర్భాలు తక్కువ. ఒకటి రెండు సార్లు మాత్రం బయటికి వచ్చినప్పుడు నాతో మాట్లాడారు. అవకాశం వచ్చినప్పుడు పిలుస్తానని చెప్పారు. కానీ ఆయన నుంచి పిలుపు రాకపోవడంతో నాలో కంగారు పెరుగుతూ వచ్చింది. ఆయన పిలిస్తే ఆ పాత్ర జీవితాంతం గుర్తుపెట్టుకునేదిలా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. సుకుమార్ గారి ఇంటి చుట్టూనే తిరగడానికి కారణం వుంది. ఆయన కొత్తవాళ్లని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. అది ఆయన సినిమాల వలన అర్థమైంది. అందువలన నాకు కూడా లైఫ్ ఇస్తారనే ఆశతోనే అలా చేశాను .. నా కల నిజమైంది" అని అన్నాడు. 
comedian mahesh

More Telugu News