Jagan: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం... చంద్రబాబుకు ఇదే నా సవాల్: వైఎస్ జగన్

  • చెప్పినట్టుగానే మా ఎంపీలు రాజీనామా చేశారు
  • చంద్రబాబు తన ఎంపీలతో రిజైన్ చేయించాలి
  • ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
  • ట్విట్టర్ లో వైఎస్ జగన్
తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, ముందుగా చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాలను నేడు స్పీకర్ కు సమర్పించారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, ఇక తన పార్టీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా హక్కని, ప్రజల పక్షాన నిలబడాలని టీడీపీకి పిలుపునిచ్చారు. కాగా, ఏపీకి హోదాను డిమాండ్ చేస్తూ, వైసీపీ సభ్యులు కొద్దిసేపటి క్రితం తమ రాజీనామా లేఖలను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందించిన సంగతి తెలిసిందే.
Jagan
Resign
MPS
Chandrababu
Challange

More Telugu News