Salman Khan: బెయిల్ పై నిర్ణయం వాయిదా... ప్రస్తుతానికి సల్మాన్ జైలులోనే!

  • బెయిల్ కోరిన సల్మాన్ ఖాన్
  • తనకు విధించిన శిక్షను సవాల్ చేయనున్న సల్మాన్
  • తీర్పు రేపటికి రిజర్వ్
రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న సల్మాన్, బెయిల్ కోసం నిన్ననే జోధ్ పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సల్మాన్ పిటిషన్ పై ఈ ఉదయం విచారణ జరిపిన న్యాయమూర్తి, తీర్పును రేపు వెల్లడిస్తానని తెలిపారు. దీంతో నిన్న జైల్లో తొలిరోజు గడిపిన సల్మాన్ నేడు విడుదలయ్యే అవకాశాలు లేకుండా పోయాయి. బెయిల్ పై తీర్పు వెలువడేవరకూ ఆయన జోధ్ పూర్ జైల్లోనే, అత్యాచార ఆరోపణల నిందితుడు ఆశారాం బాపూ పక్క గదిలో ఉండక తప్పదు. 
Salman Khan
Jodhpur
Bail
Jail

More Telugu News