plastic in rice: కలుషిత ఆహారం... ఒక్కో భోజనంలో 100 ప్లాస్టిక్ రేణువులు!

  • ఏడాదిలో 68,145 ప్లాస్టిక్ ఫైబర్ కడుపులోకి
  • ఇంట్లోని దుమ్ము, పరిసరాల నుంచి ఆహారంలోకి
  • బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

అంతటా విస్తరించిన ప్లాస్టిక్ మన ఆరోగ్యానికి పెద్ద మహమ్మారిలా తయారైంది. తక్కువ బరువు, మన్నికైన వినియోగం ప్లాస్టిక్ ను మన ఇంటికి చేర్చింది. విస్తృత వినియోగంతో చివరికి ఈ రసాయనం మనం తినే ఆహారంలోనూ చేరి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. మనం తినే ప్రతీ భోజనంలోనూ 100 సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నట్టు ఓ పరిశోధనలో తేలింది. ఇంట్లో మనం వినియోగించే ఫర్నిషింగ్ లు అంటే సోఫా కవర్లు, కర్టెన్లు ఇతరత్రా వస్త్రాల నుంచి పాలీమర్లు, సింథటిక్ వస్త్రాల రేణువులు ఇంట్లోని దుమ్ములోకి చేరి చివరికి అవి మన భోజన ప్లేట్లలోకి వస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

బ్రిటన్ లోని హెరియాట్ వాట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్లాస్టిక్ తో కూడిన దుమ్ము టేబుల్స్ ను అంటిపెట్టుకుని అక్కడి నుంచి భోజన ప్లేట్లలోకి వస్తున్నాయని వారు పేర్కొన్నారు. ప్లాస్టిక్ ప్లేట్ లో 20 నిమిషాల భోజన సమయంలో 14 ప్లాస్టిక్ ముక్కలను గుర్తించారు. ఇవి 114 ప్లాస్టిక్ ఫైబర్ కు సమానమని, ఈ విధంగా ఓ ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 68,415 ప్లాస్టిక్ ఫైబర్ లను తింటున్నట్టు వెల్లడించారు.

More Telugu News