amit shah: అమిత్ షా, అరుణ్ జైట్లీల మధ్య తార స్థాయికి చేరిన విభేదాలు!

  • ప్రభుత్వ  వ్యవహారాల్లో పెరిగిపోయిన షా జోక్యం
  • ఆర్థిక శాఖలో కూడా వేలు పెడుతున్న వైనం
  • ఏపీ ప్యాకేజీలో కూడా మార్పులు చేర్పులు
  • షా జోక్యంపై అసహనానికి గురవుతున్న జైట్లీ

ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడు, నమ్మిన బంటు అయిన అమిత్ షా వ్యవహారశైలి ఆ పార్టీలోని సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే అద్వాణీ, మురళీ మనోహన్ జోషి, యశ్వంత్ సిన్హా తదితర సీనియర్లను పక్కన పెట్టిన అమిత్ షాపై... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గుర్రుగా ఉన్నారని సమాచారం. వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని... విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయని చెప్పుకుంటున్నారు.

తన శాఖకు సంబంధించిన అంశాల్లో అమిత్ జోక్యం విపరీతంగా పెరిగిపోవడంలో జైట్లీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ సహా పలు ఆర్థిక అంశాల్లో షా, జైట్లీల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయట. అమిత్ షా రాజ్యసభ సభ్యుడైన తర్వాత వీరి మధ్య వివాదాలు మరింత పెరిగాయట. బీజేపీ రాజ్యసభ పక్ష నేత అయిన జైట్లీని ఏమాత్రం లెక్క చేయకుండా, పార్టీ రాజ్యసభ సభ్యులను అమిత్ షానే నిర్దేశిస్తున్నారట.

ప్రభుత్వ నిర్ణయాల్లో అమిత్ షా జోక్యంపై ప్రధాని మోదీ వద్ద కూడా జైట్లీ లేవనెత్తినప్పటికీ... మోదీ సీరియస్ గా తీసుకోలేదట. పార్టీ వ్యవహారాల్లో ఎవరినీ వేలు పెట్టనివ్వని అమిత్ షా... ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం జోక్యం చేసుకోవడం ఏమిటని జైట్లీ తన సన్నిహితులతో వాపోయారట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీకి సంబంధించిన ప్యాకేజీపై జైట్లీ, సుజనాచౌదరిలు అంశాలను నిర్ణయించేవారని... చివర్లో అమిత్ షై ఎంటరై కొన్ని అంశాలను కొట్టేసేవారని చెబుతున్నారు. మరోవైపు త్వరలో జరగనున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అరుణ్ జైట్లీ శాఖను మార్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News