ipl: ఢిల్లీ డేర్ డెవిల్స్ షాక్... ఐపీఎల్ నుంచి రబడా ఔట్!

  • వెన్నెముక గాయం బారిన పడిన కగిసో రబాడ
  • మూడు నెలల విశ్రాంతి సూచించిన వైద్యులు
  • ఐపీఎల్ కు దూరమైనట్టు ప్రకటించిన సఫారీ జట్టు మేనేజర్
ఐపీఎల్‌ సీజన్‌-11 ప్రారంభం కాకముందే ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. డేర్ డెవిల్స్ జట్టు ప్రధాన బౌలర్ కగిసో రబాడ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. వెన్నెముక కింది భాగంలో గాయం కావడంతో మూడు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

దీంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి రబాడ దూరం కానున్నాడు. ఆసీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న రబాడపై ఢిల్లీ డేర్ డెవిల్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. టోర్నీకి అతను దూరం కానున్నట్టు దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్‌ మహమ్మద్‌ మూసాజీ తెలపడంతో ఆ జట్టు షాక్ కు గురైంది.
ipl
derlhi derdevils
kagiso rabada

More Telugu News