Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం పూజలు చేసిన బాలీవుడ్ నటి

  • ముంబై వరసిద్ధి వినాయక ఆలయంలో పూజలు
  • సోదరితో కలసి గుడికి వెళ్లిన కత్రినా 
  • సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

కృష్ణ జింకను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్షను జోధ్ పూర్ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు నుంచి సల్మాన్ బయటపడాలని బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ ఈ ఉదయం పూజలు చేసింది. ముంబైలో ఉన్న ప్రసిద్ధ వరసిద్ధి వినాయక గుడికి తన సోదరితో కలసి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయినప్పటికీ కోర్టు మాత్రం తన పని తాను చేసుకుపోయింది. మరోవైపు ఈ కేసులో టబు, సైఫ్ అలీ ఖాన్, సొనాలీబింద్రేలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 

  • Loading...

More Telugu News