Congress: రాజ్యసభలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సభ్యుల నినాదాలు.. సభ 15 నిమిషాల వాయిదా

  • టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సభ్యుల నినాదాలు
  • ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని ప్లకార్డుల ప్రదర్శన 
  • వెల్‌లోకి దూసుకెళ్లిన వైనం
రాజ్యసభలో గందరగోళం కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య సభను సజావుగా సాగించే అవకాశం లేకుండా పోతోంది. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని ప్లకార్డులు పట్టుకుని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లడంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్ వారిని తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. కూర్చుంటే అన్ని అంశాలపై చర్చించవచ్చని, గందరగోళం చెలరేగితే సభ ముందుకు సాగదని చెప్పారు. వెల్‌లోకి వచ్చి ఇలా నినాదాలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. అయినప్పటికీ సభ్యులు వినకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. 
Congress
YSRCP
Telugudesam

More Telugu News