jd lakshminayarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనంటూ మహిళ హల్ చల్.. చంద్రబాబు నివాసం వద్ద ఘటన

  • చంద్రబాబు ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ
  • పోలీసులకు పొంతన లేని సమధానాలిచ్చిన రీటా
  • పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

అమరావతిలోని ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఓ మహిళ అలజడి రేపింది. ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను పోలీసులు ప్రశ్నించగా... సచివాలయానికి వెళుతున్నానని చెప్పింది. అయితే, ఆమె అక్కడ నుంచి వెళ్లకుండా, అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు మరోసారి ఆమెను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సీబీఐ అధికారిని అంటూ ఒకసారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనంటూ మరోసారి పొంతన లేకుండా సమాధానాలు ఇచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర స్వాధీనం చేకున్న ఓ పత్రంలో ఆమె పేరు ఎర్విన్ రీటాగా ఉంది. భర్త స్థానంలో వీవీ లక్ష్మీనారాయణ అని ఉంది. అనంతరం ఆమెను తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. 

More Telugu News