arun jaitley: అరుణ్ జైట్లీకి మూత్రపిండాల సమస్య.. త్వరలో శస్త్రచికిత్స?

  • వెంటనే చేయాలని సూచించిన వైద్యులు
  • ఎయిమ్స్ లో లేదంటే సింగపూర్ లో 
  • బయట తిరగొద్దని సూచన

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కిడ్ని సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు ఎయిమ్స్ వైద్యులు మూత్రపిండాల మార్పిడి చికిత్స నిర్వహించనున్నారు. ప్రజల్లోకి వెళ్లొద్దని, కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోయారు. జైట్లీకి శస్త్రచికిత్స ఎయిమ్స్ లో చేయకపోతే సింగపూర్ లో చేసే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాల సమాచారం.

65 ఏళ్ల వయసుల్లో ఉన్న జైట్లీకి మూత్రపిండాల మార్పిడి చికిత్స వెంటనే చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకే ఆయన సోమవారం నుంచీ ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న జైట్లీ 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బరువు తగ్గే సర్జరీ (బేరియాట్రిక్) చేయించుకున్నారు. అప్పటి నుంచే ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తాయి. 

More Telugu News