salman khan: సల్మాన్ జైలు పాలు కావడంతో ఆందోళనలో పడిన నిర్మాతలు!

  • నాలుగు సినిమాల్లో నటించే ప్లాన్ చేసుకున్న సల్మాన్
  • రెండు టీవీ షోలకు వ్యాఖ్యాతగా సల్మాన్
  • సందిగ్ధంలో పడిన నిర్మాతలు 

1998 అక్టోబర్ లో 'హమ్ సాత్ సాత్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ లోని కంకణి దగ్గర కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కు జోథ్‌ పూర్‌ న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో బాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురైంది. దీంతో సల్మాన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

సల్మాన్ ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా దర్శకత్వంలో 'రేస్‌ 3' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే దుబాయ్‌ షెడ్యూల్‌ ను ముగించాడు. ఈద్ కానుకగా ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వంలో అతుల్‌ అగ్నిహోత్రి నిర్మించనున్న 'భరత్‌' సినిమాలో కూడా సల్మాన్ నటించాల్సి ఉంది.

ఆ తరువాత సోనాక్షి సిన్హాతో కలిసి 'దబాంగ్‌ 3' కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ తరువాత 'కిక్‌ 2' లో నటించనున్నాడు. ఈ సినిమాని 2019 క్రిస్మస్‌ కు రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. ఈ సినిమాలతో పాటు 'దస్‌ కా దమ్‌', రియాల్టీ షో 'బిగ్‌ బాస్‌' లకు సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాల్సి ఉంది. జైలు శిక్ష నేపథ్యంలో ఇవన్నీ సందిగ్ధంలో పడగా, నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. 

  • Loading...

More Telugu News