ntr: ఎన్టీఆర్ అంకితభావానికి ఇదో నిదర్శనం!

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ 
  • పాత్ర కోసం ఎన్టీఆర్ కసరత్తు 
  • ప్రేమకథా నేపథ్యమే ప్రధాన కథాంశం
కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఎన్టీఆర్, తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రేమకథా నేపథ్యంతో కూడిన ఈ సినిమా కోసం జిమ్ లో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నాడనీ .. బరువు తగ్గడమే కాకుండా మరింత ఫిట్ నెస్ తో కనిపించనున్నాడని అన్నారు.

రీసెంట్ గా ఐపీఎల్ తెలుగు వెర్షన్ ప్రమోషన్లో పాల్గొన్న ఆయనను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నిజంగానే ఆయన చాలా వరకూ బరువు తగ్గి కనిపించాడు. త్రివిక్రమ్ సినిమా కోసమే ఆయన 3 నెలల్లో 20 కేజీలు తగ్గాడట. మరింత బరువు తగ్గనున్నట్టు కూడా ఆయన జాతీయ మీడియాతో చెప్పాడు. గతంలో 'యమదొంగ' సినిమా కోసం కూడా ఎన్టీఆర్ బాగా బరువు తగ్గిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్ల తరువాత ఆయన చేస్తోన్న కసరత్తు .. నటన పట్ల ఆయనకి గల అంకితభావానికి అద్దం పడుతోందని అభిమానులు అంటున్నారు.     
ntr
trivikram

More Telugu News