Commonwealth Games: కామన్వెల్త్ క్రీడలలో ఎగరిన భారత పతాక... స్వర్ణం సాధించిన మీరాబాయి చాను

  • 190 కిలోల బరువును ఎత్తిన చానూ
  • సరికొత్త కామన్వెల్త్ రికార్డు
  • 'జనగణమన' ఆలాపనతో దద్దరిల్లిన స్టేడియం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీల్లో సాయిఖోమ్ మీరాబాయి చానూ స్వర్ణ పతకం సాధించి, భారత పతాకాన్ని రెపరెపలాడించింది. వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో పోటీ పడ్డ చానూ, మిగతావారికన్నా మిన్నగా రాణించి స్వర్ణపతకాన్ని ఎగరేసుకుపోయింది. ఈ పోటీల్లో ఇండియాకు లభించిన తొలి స్వర్ణ పతకం ఇదే. స్నాచ్ విభాగంలో తన మూడు అటెంప్ట్ లలో వరుసగా 80, 84, 86 కిలోల బరువును ఎత్తిన ఆమె, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో వరుసగా 103, 107, 110 కిలోల బరువును ఎత్తింది. మొత్తంగా 196 కిలోల బరువును ఎత్తిన ఆమె, కామన్వెల్త్ రికార్డును నెలకొల్పింది.
Commonwealth Games
chanu
Meerabai Chanu

More Telugu News