Vijayawada: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపనున్న తేజస్విని!

  • యాక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ అయిన టెక్కీ తేజస్విని
  • అవయవదానానికి అంగీకరించిన తల్లిదండ్రులు
  • నేడు అవయవాలను తొలగించనున్న వైద్యులు
  • తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పోలీసులు

మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ చేసిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ ఉదయం విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ సహా, పలువురు అధికారులు ఆమె తల్లిదండ్రులను పరామర్శించి, ఆమె అవయవాలను దానం చేయడం ద్వారా, తేజస్వినిని వారిలో చూసుకోవచ్చని చెప్పడంతో వారు అవయవదానానికి అంగీకరించారు.

 ఆమె గుండె, కిడ్నీలు, కాలేయం తదితరాలను అవసరమైన వారికి అందిస్తామని, తేజస్విని తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆమె అవయవాలను నేడు శరీరం నుంచి వేరు చేసి తరలిస్తామని వైద్యులు స్పష్టం చేయగా,, అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, గ్రీన్ కారిడార్ కు సహకరిస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News