anasuya: చరణ్ తో అత్తా అని పిలిపించుకోవాలా? అని అడిగాను!: అనసూయ

  • 'రంగస్థలం' కథ విన్నప్పుడు చరణ్ హీరో అని తెలియదు
  • లేడీ ప్రకాష్ రాజ్ లా కావడం నా కోరిక
  • 'నటిగా చాలా ఎదిగావ్ అనసూయ' అంటూ భర్త కితాబు 
'రంగస్థలం'లోని రంగమ్మత్త క్యారెక్టర్ లో ప్రేక్షకులు తనను యాక్సెప్ట్ చేస్తారా, లేదా? అనే డౌట్ ఉండేదని... కానీ, ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదని నటి అనసూయ అన్నారు. 'ఆర్య 2' సినిమాలో నటించమని అప్పట్లోనే దర్శకుడు సుకుమార్ తనను అడిగినప్పటికీ, చేయలేకపోయానని చెప్పారు. తనను తాను ఎక్కువగా ఊహించుకోనని... తక్కువ చేసి చూసుకుంటానని... ఇదే తన విజయ రహస్యమని తెలిపారు. ఒకే ఇమేజ్ లో కూరుకుపోవాలనే ఆలోచన తనకు లేదని... ప్రకాష్ రాజ్ లా అన్ని పాత్రలు చేసి, మెప్పించాలనేది తన కోరిక అని... ఇంకా చెప్పాలంటే 'లేడీ ప్రకాష్ రాజ్'లా అవ్వడం తన ధ్యేయమని చెప్పారు.

'రంగస్థలం' కథ విన్నప్పుడు ఆ సినిమాలో రామ్ చరణ్ హీరో అనే విషయం తనకు తెలియదని అనసూయ తెలిపారు. ఆ తర్వాత చరణ్ తో అత్తా అని పిలిపించుకోవాలా? అని అడిగానని... కనీసం రంగమ్మా అని అయినా పిలిపించండి అని సుకుమార్ ను రిక్వెస్ట్ చేశానని చెప్పారు. మా ఆయన ఈ సినిమా చూశాక 'అనసూయ నటిగా చాలా ఎదిగావ్' అని అన్నారని... ఆయన నుంచి నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది అని తెలిపారు. 
anasuya
actress
Tollywood
rangasthalam
sukumar
Ramcharan
Prakash Raj

More Telugu News