Apsara: అమెరికా నుంచి మన 'అప్సర' శిల్పం వచ్చేస్తోంది!

  • దశాబ్దాల క్రితం తరలిపోయిన పురాతన శిల్పం
  • ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ మ్యూజియంలో
  • తిరిగి ఇచ్చేందుకు అంగీకరించిన అమెరికా

ఎన్నో దశాబ్దాల క్రితం అమెరికాకు తరలిపోయిన ఓ అద్భుత శిల్పం తిరిగి ఇండియాకు రానుంది. వివిధ దేశాల్లో ఉన్న పురాతన భారత శిల్ప సంపదను తిరిగి తెప్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ మ్యూజియంలో ఉన్న 'అప్సర'ను తిరిగి ఇండియాకు ఇచ్చేందుకు అక్కడి అధికారులు అంగీకరించారు.

ఈ శిల్పానికి వెలకట్టలేమని, దీన్ని ఇచ్చేందుకు అమెరికా అంగీకరించిందని కేంద్ర సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, మధ్య భారత దేశంలో పదకొండవ శతాబ్దానికి చెందిన శిల్పంగా దీన్ని భావిస్తున్నారు. 

More Telugu News