Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి 420 తాతయ్య!: మంత్రి జవహర్ వ్యంగ్యం

  • మోసం చేయడంలో విజయసాయిరెడ్డిని మించినవారు లేరు
  • ఆయనకు అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది!
  • పవన్ ఏం మాట్లాడాతారో, ఏం చేస్తారో అర్థం కావడం లేదు!
  • జేఎఫ్సీ కమిటీ ఏర్పాటుతో ఆయన ఏం సాధించారు?

సీఎం చంద్రబాబును ‘యూటర్న్ అంకుల్’గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఇంకా మండిపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని ‘420 తాతయ్య’ అంటూ మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోసం చేయడంలో విజయసాయిరెడ్డిని మించినవారు లేరని, ఆయనకు అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని, జగన్ జైలుకు వెళ్లకుండా ఉండేలా చూడాలని విజయసాయిరెడ్డి ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన విమర్శలు చేశారు. పవన్ ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో అర్థం కావడం లేదని, జేఎఫ్సీ కమిటీ ఏర్పాటు చేసిన పవన్ ఏం సాధించారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News