android go: సాధారణ ఫోన్లను స్మార్ట్ ఫోన్లలా పరిగెత్తించే 'ఆండ్రాయిడ్ గో'

  • లావా జెడ్ 50, నోకియా 1 మోడళ్లు దీనిపై పనిచేసేవే
  • ఫోన్ స్టోరేజీలో యాప్స్ వినియోగించేది తక్కువే 
  • ఈ వెర్షన్ లో ఫోన్లో ఖాళీ స్టోరేజీ ఎక్కువగా లభిస్తుంది.

ఆండ్రాయిడ్ గో వెర్షన్ గురించి ఇటీవలి తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏంటిది? అన్న సందేహం కొందరికి వచ్చి ఉండొచ్చు. ఆండ్రాయిడ్ ఓరియోలోనే ఇదొక వెర్షన్. సాధారణ సామర్థ్యం కలిగిన ఫోన్లను సైతం అధిక సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్ల మాదిరిగా నడిపించగలదని గూగుల్ అంటోంది. ప్రారంభ ధర స్మార్ట్ ఫోన్లలో మరింత వేగవంతమైన అనుభవం కోసం గూగుల్ దీన్ని తీసుకొచ్చింది. గో వెర్షన్ పై ఇప్పటికే లావా జెడ్50 పేరుతో ఓ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.5,500. తాజాగా నోకియా సైతం గో సాఫ్ట్ వేర్ పై పనిచేసే నోకియా 1 మోడల్ ను ఆవిష్కరించింది.

గో వెర్షన్ లో యూజర్లకు ఫోన్లో ఖాళీ స్టోరేజీ ఎక్కువగా లభిస్తుంది. యాప్స్ ఎక్కువ సైజు తీసుకోవు. మిగిలిన ఫోన్లతో పోలిస్తే రెండింతలు ఖాళీ స్పేస్ ఉంటుంది. ఎక్కువ స్టోరేజీ తీసుకోకుండా గో ఆధారిత యాప్స్ ను గూగుల్ ఇప్పటికే సిద్ధం చేసింది. చివరికి యూ ట్యూబ్ లో వీడియోలను సైతం ఈ వెర్షన్ పై అంతరాయాల్లేకుండా వీక్షించొచ్చు. మన దేశంలో ఇప్పటికీ 60 కోట్ల మంది యూజర్లు ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. దీంతో వీరిలో ఎక్కువ మందిని స్మార్ట్ ఫోన్ల వైపు ఆకర్షించేందుకు 'గో' ఉపయోగపడుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.

More Telugu News