saidharan tej: మెగాహీరో రొమాంటిక్ లవ్ స్టోరీకి అందమైన టైటిల్?

  • తేజుతో కరుణాకరన్ మూవీ
  • ప్రేమకథాంశమే నేపథ్యం
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్       
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు నిర్మించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అలా ఆయన బ్యానర్ నుంచి 45వ సినిమా నిర్మితమవుతోంది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాకి కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి 'అందమైన చందమామ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనేది టాక్. ఇందులో నిజంలేదనే వార్త కూడా బలంగానే వినిపిస్తోంది.

 కరుణాకరన్ కి ప్రేమకథల స్పెషలిస్ట్ అనే పేరుంది. ఈసారి కూడా ఆయన తనదైన స్టైల్లో రొమాంటిక్ లవ్ స్టోరీని మలుస్తున్నాడని తెలుస్తోంది. మాస్ హీరోగా మార్కులు కొట్టేసిన తేజును ఆయన ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.       
saidharan tej
karunakaran

More Telugu News